BRS MLA: ఇందిరమ్మ రాజ్యం లో ప్రతిపక్షాల పైన దాడులు : కడియం శ్రీహరి
- Author : Balu J
Date : 25-02-2024 - 11:48 IST
Published By : Hashtagu Telugu Desk
BRS MLA: హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. 30ఏండ్ల నాటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వ రెండు నెలలోపే వచ్చాయ్. ఆగ్రoపహాడ్ జాతరికి మాజీ ఏమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ని చూసిన కార్యకర్తలు, భక్తులు జై చల్లా, జై తెలంగాణ నినాదాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి గొడవ జరగలేదు అని ఆయన అన్నారు.
‘‘బలవంతంగా కానిస్టేబుల్ తో 12మంది పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించి న పోలీసులు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని ప్రతిపక్షాల పైన దాడులు జరుగుతున్నాయి. 12మంది బీ ఆర్ ఎస్ కార్యకర్తలను చిత్ర హింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఆత్మకూరు ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలి’’ ఆయన డిమాండ్ చేశారు. కడియం వెంట మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి , అరూరి రమేష్ , బిఆరెస్ జిల్లా నాయకులు లలితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.