Migrant Boat Accident: వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా, 12 మంది మృతి
ఇంగ్లీష్ ఛానల్‌లో వలసదారులతో వెళుతున్నపడవ ప్రమాదం సంభవించింది. ఇందులో 12 మంది చనిపోయారు. ఇద్దరు గల్లంతయ్యారు, పలువురు గాయపడ్డారు. గల్లంతైన బాధితుల కోసం అత్యవసర సేవలు పనిచేస్తున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 12:23 AM, Wed - 4 September 24
Migrant Boat Accident: వలసదారులను తీసుకువెళుతున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇంగ్లీష్ ఛానల్‌లో వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా పడడంతో కనీసం 12 మంది మరణించారని ఫ్రెంచ్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డార్మానిన్ తెలిపారు. దాదాపు 50కి పైగా వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 12 మంది చనిపోయారు.
బౌలోగ్నే-సుర్-మెర్‌లో ఏర్పాటు చేసిన రెస్క్యూ సెంటర్‌కు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నట్లు దర్మానిన్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ఒక భయంకరమైన నౌక ప్రమాదం సంభవించింది. ఇందులో 12 మంది చనిపోయారు. ఇద్దరు గల్లంతయ్యారు, పలువురు గాయపడ్డారు. గల్లంతైన బాధితుల కోసం అత్యవసర సేవలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ ఘటనలో 53 మందిని రక్షించామని, 12 మంది మరణించారని ఫ్రెంచ్ తీర రక్షక దళం తెలిపింది. రక్షించబడిన వారిలో కొందరిని బౌలోగ్నే-సుర్-మెర్‌కు తీసుకెళ్లగా, మరికొందరిని హెలికాప్టర్‌లో లే పోర్టెల్‌కు తరలించారు.
53 మంది ప్రాణాలతో బయటపడిన వారిలో చాలా మందికి తక్షణ చికిత్స అవసరమని కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి కోసం బౌలోగ్నే-సుర్-మెర్‌లో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం ఉదయం కలైస్‌కు నైరుతి దిశలో ఉన్న క్యాప్ గ్రిస్-నెజ్ తీరంలో పడవ బోల్తా పడినట్లు సమాచారం అందిందని ఫ్రెంచ్ కోస్ట్ గార్డ్ తెలిపారు. దీని తరువాత సమీపంలోని రెస్క్యూ షిప్ సంఘటనా స్థలానికి చేరుకుంది. నేవీ హెలికాప్టర్‌తో సహా ఇతర హెలికాప్టర్‌లను కూడా అత్యవసర సేవల కోసం వినియోగించారు. కాగా సోమవారం నాటి క్రాష్‌తో 2024లో ఇంగ్లండ్ చేరుకోవడానికి ప్రయత్నించి మరణించిన వలసదారుల సంఖ్య 37కి చేరుకుందని బిబిసి తెలిపింది.
Also Read: Rajouri Encounter: రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్
Related News
Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈవోను విడుదల చేసిన ఫ్రాన్స్..!
టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ అరెస్టు తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫ్రాన్స్‌తో 80 యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసింది.