Assembly Polls Schedule: ఈనెల 12న అసెంబ్లీ పోల్స్ షెడ్యూల్ ?
Election Schedule : త్వరలోనే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
- By Pasha Published Date - 07:03 AM, Fri - 6 October 23

Assembly Polls Schedule: త్వరలోనే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఈనెల 12న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికపై చర్చించేందుకు ఈరోజు (శుక్రవారం) కేంద్ర ఎన్నికల సంఘం తమ పరిశీలకులతో సమావేశం కానుంది. ఇందులో పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్ సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏమేం చేయాలి ? ధనబలం, కండబలం కలిగిన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయకుండా కట్టడి చేయడం ఎలా ? అనే అంశాలపై నేటి మీటింగ్ లో సమీక్షించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటికే రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో ఎన్నికల సంసిద్దతను ఎన్నికల సంఘం సమీక్షించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాం శాసన సభ పదవీకాలం డిసెంబర్ 17తో ముగియనుంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది.తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో (Assembly Polls Schedule) ముగియనుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.
Also read : Tamarind Health Benefits: చింతపండు తింటే.. ఈ సమస్యలు ఉండవు..!