Assam Road Accident: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి: విద్యార్థుల వివరాలు !
అస్సాంలోని గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
- By Praveen Aluthuru Published Date - 10:01 AM, Mon - 29 May 23

Assam Road Accident: అస్సాంలోని గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ తుబే ప్రతీక్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రాథమిక విచారణలో మృతుల్లో విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న 01 GC 8829 నంబర్ గల స్కార్పియో కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా ఉన్న బోలెరో పికప్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. జలుక్‌బరి ఫ్లైఓవర్ రోడ్డుపై గౌహతి వైపు నుంచి వస్తున్నట్లు సమాచారం.
అద్దెకు తీసుకున్న వాహనంలో పది మంది వ్యక్తులు ఉన్నారు. పది మందిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కి తరలించారు.
Assam | At least seven dead and several others injured in a road accident that took place in the Jalukbari area of Guwahati on Sunday late night. pic.twitter.com/5gELk04tCR
— ANI (@ANI) May 29, 2023
ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల వివరాలు:
గౌహతికి చెందిన అరిందమ్ భల్లాల్
గోలాఘాట్ చెందిన నియోర్ దేకా
చరైడియో నుండి కౌశిక్ మోహన్
నాగోన్ నుండి ఉపాంగ్షు శర్మ
మజులి నుండి రాజ్‌కిరణ్ భుయాన్
దిబ్రూఘర్‌కు చెందిన ఎమోన్ గయాన్
మంగళ్‌దోయికి చెందిన కౌశిక్ బారుహ్
క్షతగాత్రుల వివరాలు:
జోర్హాట్ నుండి అర్పన్ భుయాన్
అర్నాబ్ చక్రవర్తి బొంగైగావ్
జోర్హాట్ నుండి మృన్మోయ్ బోరా
Read More: Manipur Violence : మణిపూర్ హింసాకాండలో మరో ఐదుగురు మృతి