Delhi Metro: సీఎం అరెస్ట్.. ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం, ఆ స్టేషన్‌లో సాయంత్రం 6 వరకు మెట్రో సర్వీసులు బంద్..!
సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన నిరసన దృష్ట్యా ఢిల్లీ మెట్రో (Delhi Metro) కీలక నిర్ణయం తీసుకుంది.
- By Gopichand Published Date - 10:25 AM, Fri - 22 March 24

Delhi Metro: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన నిరసన దృష్ట్యా ఢిల్లీ మెట్రో (Delhi Metro) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రో నిర్ణయం ప్రకారం.. ITO మెట్రో స్టేషన్ శుక్రవారం మూసివేయబడుతుంది. మెట్రో ITO స్టేషన్ గుండా వెళుతుంది కానీ ప్రయాణికులు దిగలేరు లేదా ఎక్కలేరు.
ITO మెట్రో స్టేషన్ ఈరోజు అంటే 22 మార్చి 2024న ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడుతుందని ఢిల్లీ మెట్రో రైల్ మేనేజ్‌మెంట్ (DMRC) పోస్ట్ Xలో తెలిపింది. ఢిల్లీ పోలీసుల సూచన మేరకు ITO మెట్రో స్టేషన్‌ను మూసివేయాలని ఢిల్లీ మెట్రో యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను మూసి ఉంచాలని ఢిల్లీ పోలీసులు గతంలో సూచించారు.
Also Read: Corruption Cases : పలు అవినీతి కేసుల్లో అరెస్టయిన సీఎంలు, మాజీ సీఎంలు వీరే..
నేడు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నిరసన
ఆమ్ ఆద్మీ పార్టీ.. భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ITO మెట్రో స్టేషన్‌కు ఆనుకుని ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో ఉన్నాయి. ఈరోజు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21 రాత్రి అరెస్టు చేసింది. అరెస్టు చేయడానికి ముందు పదో సమన్లతో ఈడీ గురువారం సాయంత్రం సీఎం నివాసానికి చేరుకుంది. రెండు గంటలకు పైగా సీఎంను విచారించిన ఈడీ.. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత ఈడీ సీఎంను తన కార్యాలయానికి తీసుకెళ్లింది.
We’re now on WhatsApp : Click to Join
వెంటనే విచారణ జరపాలని డిమాండ్
మరోవైపు ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ గత రాత్రి ఢిల్లీ సీఎం అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే విచారణను డిమాండ్ చేసింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగే అవకాశం ఉంది.