Chandrababu Case : ఏసీబీ కోర్ట్ లో ముగిసిన వాదనలు
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వినిపించిన వాదనలు చూస్తే..
- By Sudheer Published Date - 03:11 PM, Sun - 10 September 23

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Development Case) కేసు కు సంబదించిన వాదనలు ఏసీబీ కోర్ట్ లో ముగిసాయి. మరికొద్ది సేపట్లో తుది తీర్పు రానుంది. ఏసీబీ కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేసిన సీఐడీ (CID)..నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఉదయం నుండి వాదనలు కొనసాగాయి.
Read Also : Chandrababu Arrest : కార్యకర్తలు సైలెంట్ ..జనసేనాధినేత దూకుడు
ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపించగా.., చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఉదయం మొదలైన వాదనలు..మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వాదనలు మొదలుపెట్టారు. 2:45 నిమిషాలకు వాదనలు ముగిసాయి. సుమారు గంటకుపైగా లూథ్రా తన వాదనలను బలంగా వాదించారు. ప్రభుత్వం, సీఐడీ అధికారులపై ఆయన సంధించిన ప్రశ్నలకు కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తుంది.
- ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వినిపించిన వాదనలు చూస్తే..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం
- 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి
- తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది.. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది
- ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు
- చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలు
- ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది
- చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది..
- అయినా కూడా ప్రభుత్వం వాళ్లనుకున్న చోటే ప్రవేశపెట్టింది.
- కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదు..?
- సీఐడీ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు.
- సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదు
- ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదు
- ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..?
- రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించండి.
- చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతోంది..కానీ బాబును ముందురోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు.
- ఆ సమయం నుంచే అరెస్ట్ చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి.
- అరెస్టు చేసిన పోలీసుల 48గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి
- అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు.
- చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం.. ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే.
- రిమాండ్ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలి
- అరెస్టు అంటే అర్థం ఏమిటో సీఐడీ లాయర్లకు వివరించిన సిద్దార్థ్ లూథ్రా
- రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించిన లూథ్రా
- రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే.
సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అంటూ సిద్దార్థ్ వాదనలు వినిపించారు. మరికాసేపట్లో ACB కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు కు బెయిల్ వస్తుందని అంటున్నారు.