HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Fight For Chandrababu

Chandrababu Arrest : కార్యకర్తలు సైలెంట్ ..జనసేనాధినేత దూకుడు

చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయిందని ..ఒక్క కార్యకర్త కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదన్నారు

  • Author : Sudheer Date : 10-09-2023 - 2:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Fight for Chandrababu
Pawan Kalyan Fight for Chandrababu

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో టీడీపీ నేతలు , కార్యకర్తలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రెండు రోజులుగా చంద్రబాబు అరెస్ట్ తో యావత్ ప్రజానీకం ఏంజరగబోతుందో అని టెన్షన్ పడుతుంటే..టీడీపీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉండడం..పెద్దగా రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు కానీ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపకపోయేసరికి అంత షాక్ అవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, ఎన్ని గొడవలు , ఎన్ని అల్లర్లు జరుగుతాయో..ప్రభుత్వానికి ఎంత ఆస్థి నష్టం వాటిల్లుతుందో అని అంత ఖంగారు పడ్డారు కానీ..అదేమీ లేదు. ఎక్కడిక్కడే సైలెంట్ గా ఉన్నారు.

కానీ ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మరోసారి వార్తల్లో నిలిచారు. చంద్రబాబు కు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా నేరుగా వెళ్లి చంద్రబాబు ను కలుస్తానని చెప్పలేదు. అయినప్పటికీ ఏపీ పోలీసులు నిన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను విజయవాడ కు రాకుండా అడ్డుకున్నారు. ముందుగా విమానంలో వద్దామని అనుకుంటే..కుదరలేదు. చివరికి రోడ్డు మార్గాన వస్తుంటే జగ్గయ్య పేట లో (Pawan Kalyan Stopped) అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయం..ఓ పక్క జోరున వర్షం పడుతుంది. అయినప్పటికీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పవన్ కు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ను పంపించకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఎన్నో ఉద్రికత్తతల నడుమ చివరకు పోలీసులే పవన్ కళ్యాణ్ ను తన ఆఫీస్ వద్దకు తీసుకెళ్లి దింపారు. ఇంత జరుగుతున్న కానీ టీడీపీ నేతలు కానీ , కార్యకర్తలు రోడ్ల పైకి రావడం చేయలేదు.

తాజాగా ఇదే అంశాన్ని మాజీ మంత్రి , వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar yadav) చెపుతూ టీడీపీ కార్యకర్తలను తక్కువ చేసారు. చంద్రబాబు పాపం పండిందని, ఆయనో అవినీతి ఆనకొండ అన్న అనిల్..చంద్రబాబు అరెస్ట్ అయితే..టీడీపీ నేతలు ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంతంగా ఉంటున్నారని, తమకు అనుకూలమైన మీడియాకు వాయిస్, వీడియో బైట్లు ఇస్తూ ఇంట్లో సైలంట్‌గా కూర్చొని ఉన్నారని అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్..పురందేశ్వరి లు చంద్రబాబు కు సపోర్ట్ చేస్తున్నారని అనిల్ చెప్పుకొచ్చాడు.

సీఐడీ కేసులో మరిదికి పురందేశ్వరి వత్తాసు పలికారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసినంత హడావిడి టీడీపీ కార్యకర్తలు, సొంత కొడుకు కూడా చేయలేదని అనిల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడే.. కుటుంబ సభ్యుడు కాదన్నారు. తన పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసినట్లు నానా యాగీ చేశాడని పవన్ పై అనిల్ మండిపడ్డారు. దేశ చరిత్రలో ఒక పార్టీ అధ్యకుడ్ని అరెస్టు చేస్తే మరో పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకు రావడం ఇదే తొలిసారి అన్నారు.

నిన్నటి చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయిందని ..ఒక్క కార్యకర్త కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదన్నారు. తద్వారా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు నోరు మెదపలేని పరిస్ధితుల్లోకి వెళ్లిపోయారని అనిల్ ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్, పురందేశ్వరి మాత్రం చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారని అనిల్ విమర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu Arrest
  • Pawan Kalyan
  • tdp
  • TDP Leaders Silent

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd