APSRTC:ఆర్టీసీ బస్సుల్లో ఫైన్ పై వస్తున్న వార్తలపై ఏపీఎస్ ఆర్టీసీ వివరణ
మాస్క్ లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి రూ.50 ఫైన్ విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది.
- By Hashtag U Published Date - 11:17 PM, Mon - 10 January 22
మాస్క్ లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి రూ.50 ఫైన్ విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణీకుల సౌకరార్థం ఏపీఎస్ ఆర్టీసీ పెద్ద ఎత్తున రెగ్యులర్ బస్సులతో పాటుగా, స్పెషల్ బస్సులను కూడా నడుపుతున్నట్లు తెలిపింది. ఈ రద్దీలో ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా బస్సులు నడిపేందుకు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అవరోధం కలిగిస్తున్న వారిపై అంటే బస్ స్టేషన్ అవరణల లో బస్సులకు అడ్డంగా బైక్ లు, స్కూటర్లు నడపడం, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేయడం, బస్ స్టేషన్ పరిసరాలలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, బస్ స్టేషన్ లో పని లేకుండా మాస్కు ధరించకుండా అనవసరంగా తిరిగే వ్యక్తులను నియంత్రించేందుకు మాత్రమే సంబంధిత సెక్యూరిటీ అధికారులు ఫైన్ లు విధించడం జరిందని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అంతే గానీ, బస్సుల్లో మాస్కు లేకుండా ఎక్కిన ప్రయాణీకులకు మాత్రం ఎటువంటి ఫైన్లు విధించలేదన్నారు. అయినప్పటికీ కొత్త కోవిడ్ వేరియంటు ఒమిక్రాన్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో, తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించవలసినదిగా ప్రయాణీకులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రయాణీకులకు ఏ ఇతర సమస్యలకైనా 24 x 7 కాల్ సెంటర్ నెంబరు: 0866 – 2570005 నందు సంప్రదించవచ్చని తెలిపారు.