Anandayya: ఓమిక్రాన్ కు ఆనందయ్య చికిత్స అందించలేడు!
- By Balu J Published Date - 11:16 AM, Sat - 8 January 22

కష్ణపట్నం ఆనందయ్య ఓమిక్రాన్ కు చికిత్స అందించలేడని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. ఇటీవల ఓమిక్రాన్ కు తన మందును పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆనందయ్య హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే ఓమిక్రాన్ వేరియంట్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి అనుమతించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఆనందయ్య మందు కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా కృష్ణపట్నంకి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వీరి వల్ల ఆ గ్రామంలో కరోనా కేసులు ఎక్కువ అయ్యాయని అక్కడి గ్రామస్తులు గతంలో ఆందోళన చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీ కి అనుమతి ఇచ్చింది కానీ తాజాగా ఓమిక్రాన్ కి కూడా తన దగ్గర మందు ఉందని పంపిణీ చేస్తున్నానని ఆనందయ్య చెప్పాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనందయ్య మందు పంపిణీ చేయవద్దంటూ గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మాణించింది. దీంతో ఆనందయ్య హైకోర్టు ఆశ్రయించగా విచారణ జరిపింది… ప్రభుత్వం తరుపున న్యాయవాదాలు ఓమిక్రాన్ కి ఆనందయ్య చికిత్స అందించలేరని హైకోర్టు కి తెలిపారు.దీంతో ఈ కేసు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.