HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Ts Rains Several Trains Cancelled As Heavy Rains

AP-TS Rains: తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం

తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌పై నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు

  • Author : Vamsi Chowdary Korata Date : 01-09-2024 - 12:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP-TS Rains
AP-TS Rains

AP-TS Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను నిలిపేశారు. అత్యవసర రైళ్ల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌పై నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడ డివిజన్‌లో 30 రైళ్లను రద్దు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో రైల్వే ట్రాక్ జలమయమైంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్లను రద్దు చేసింది. ఈ రోజు ఆదివారం భారీ వర్షపాతం నెలకొనడంతో మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో సింహాద్రి, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. గౌతమి, సంఘమిత్ర-కావేరి, చార్మినార్, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు డోర్నకల్ లో మున్నేరు వాగు ఉప్పొంగింది. భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగుకు జలకళ సంతరించుకుంది. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా అటుగా వెళ్లే భారీ వాహనాలను నిలిపివేశారు.

Rains

భారీ వర్షాల కారణంగా విజయవాడ-సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్-విజయవాడ (12714), గుంటూరు-సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సికింద్రాబాద్-గుంటూర్ (12706) మరియు గుంటూరు-12306 12705) రైళ్లు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ పలు రైళ్ల రూట్లను రైల్వే అధికారులు మార్చారు. విశాఖపట్నం-తిరుపతి రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లలో అన్ని స్టాప్‌లు తొలగించబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నామని, రద్దు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేసింది: హైదరాబాద్ – 27781500, సికింద్రాబాద్ – 27786170, కాజీపేట – 27782660, 8702576430, వరంగల్ – 27782751, ఖమ్మం – 28452-0275451 69305697, రాజమండ్రి – 08832420541, తెనాలి – 7815909479, నెల్లూరు – 7815909469, గూడూరు – 08624250795, ఒంగోలు – 7815909489. 5909462.

Also Read: Nara Lokesh : వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap rains
  • Dornakal Rains
  • MAHABUBABAD
  • Munneru River
  • telangana rains
  • telugu news
  • trains cancelled
  • Vijayawada Live

Related News

'Towing' food app launched in Vijayawada.

Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

Toing : దేశంలోనే అత్యంత సరసమైన ధరలకే ఆహారాన్ని డెలివరీ చేసే ప్రముఖ యాప్ ‘టోయింగ్’ (Toing) విజయవాడ నగరంలో తన సేవలను అధికారికంగా ప్రారంభించింది. సెప్టెంబర్ 2025లో పూణే వేదికగా మొదలైన ఈ సరికొత్త యాప్, కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చకచకా విస్తరించి, విజయవాడతో కలిపి మొత్తం 49 నగరాలకు చేరుకుంది. టోయింగ్ యాప్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే… ఇందులో లభించే ఆహార పదార్థా

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

  • Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd