AP-TS Rains: తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌పై నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు
- By Praveen Aluthuru Published Date - 12:41 PM, Sun - 1 September 24

AP-TS Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను నిలిపేశారు. అత్యవసర రైళ్ల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌పై నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడ డివిజన్‌లో 30 రైళ్లను రద్దు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో రైల్వే ట్రాక్ జలమయమైంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్లను రద్దు చేసింది. ఈ రోజు ఆదివారం భారీ వర్షపాతం నెలకొనడంతో మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో సింహాద్రి, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. గౌతమి, సంఘమిత్ర-కావేరి, చార్మినార్, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు డోర్నకల్ లో మున్నేరు వాగు ఉప్పొంగింది. భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగుకు జలకళ సంతరించుకుంది. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా అటుగా వెళ్లే భారీ వాహనాలను నిలిపివేశారు.
భారీ వర్షాల కారణంగా విజయవాడ-సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్-విజయవాడ (12714), గుంటూరు-సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సికింద్రాబాద్-గుంటూర్ (12706) మరియు గుంటూరు-12306 12705) రైళ్లు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ పలు రైళ్ల రూట్లను రైల్వే అధికారులు మార్చారు. విశాఖపట్నం-తిరుపతి రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లలో అన్ని స్టాప్‌లు తొలగించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నామని, రద్దు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేసింది: హైదరాబాద్ – 27781500, సికింద్రాబాద్ – 27786170, కాజీపేట – 27782660, 8702576430, వరంగల్ – 27782751, ఖమ్మం – 28452-0275451 69305697, రాజమండ్రి – 08832420541, తెనాలి – 7815909479, నెల్లూరు – 7815909469, గూడూరు – 08624250795, ఒంగోలు – 7815909489. 5909462.
Also Read: Nara Lokesh : వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన