HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap To Receive Rains For Next 24 Hours As Low Pressure Continues

Rains In AP : ఏపీలో రానున్న 24 గంట‌ల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం – ఐఎండీ

అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలో రానున్న 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. బుధవారం నాటికి దక్షిణ ఒడిశాలో

  • Author : Prasad Date : 14-07-2022 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rains
Rains

అల్పపీడనం కొనసాగుతుండటంతో ఏపీలో రానున్న 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. బుధవారం నాటికి దక్షిణ ఒడిశాలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో పరివేష్టిత ఉపరితల ద్రోణిలో నైరుతి దిశలో ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవన ద్రోణి, షీర్ జోన్ దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాకినాడ, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురవగా, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తీరంలోని మత్స్యకారులు ఈ నెల 16 వరకు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అయితే శుక్రవారం నుంచి రెండు మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది.

మరోవైపు గోదావరికి వరద పోటెత్తుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు. 6 NDRF, 4 SDRF బృందాలు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలోని 51 లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వరద బాధితులు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి బుధవారం కూడా భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం ఎగువ పరివాహక ప్రాంతంలోని జూరాల నుంచి జలాశయానికి 1,05,822 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, గరిష్ట నీటి నిల్వ 215.807 టీఎంసీలు. ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం 6 గంటలకు 826.90 అడుగుల వద్ద 46.5146 టీఎంసీలు నమోదయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • heavy rains
  • kakinada
  • rains
  • Rayalaseema

Related News

    Latest News

    • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd