Andhra Pradesh : చంద్రబాబుకు జగన్ సర్కార్ షాక్.. ఇక రోడ్లపై బహిరంగ సభలు నిషేధం
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, మున్సిపల్,
- By Prasad Published Date - 09:13 AM, Tue - 3 January 23

రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, మున్సిపల్, పంచాయత్ రాజ్ రహదారుల్లో కాకుండా ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని చోట్ల అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో సభలు, ర్యాలీలకు చాలా అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతి ఇస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.