Dussehra Holidays : సెప్టెంబర్ 26 నుంచి ఏపీలో దసరా సెలవులు
ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 26 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది...
- By Prasad Published Date - 09:21 AM, Wed - 14 September 22

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 26 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిఇలా ఉండగా.. క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి 6 వరకు సెలవులు ఉంటాయని.. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో 220 పనిదినాలలో 80 పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.