Andhra Pradesh: పింఛన్ల ను రూ.2,250 నుంచి రూ.2,500కి పెంచిన ప్రభుత్వం
- By hashtagu Published Date - 12:49 PM, Sat - 1 January 22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, హెచ్ఐవీ పేషెంట్లు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు ఇచ్చే సామాజిక పింఛన్లను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటిదాకా నెలకు రూ.2,250 ఇస్తుండగా.. నూతన సంవత్సర కానుకగా ఇవాళ్లి నుంచి రూ.2,500కు పెంచింది. ఈ పెంపుతో ప్రభుత్వం నెలకు పెన్షన్లపై రూ.1,570 కోట్లు ఖర్చు చేయనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో పింఛన్ల పెంపును ఏపీ సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు.