AP Movie Ticket Issues: సినిమా టికెట్ ధరల పై.. ఈరోజు కీలక చర్చ..!
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా నలుగుతున్న సినిమా టికెట్ ధరల విషయం నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
- Author : HashtagU Desk
Date : 17-02-2022 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా నలుగుతున్న సినిమా టికెట్ ధరల విషయం నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో టికెట్ రేట్ల అంశానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఈరోజు భేటీ కాబోతోంది. ఈ సమావేశం అనంతరం సినిమా టికెట్ ధరలపై కమిటీ ప్రభుత్వానికి తుది నివేదికను అందించనుంది. దీంతో ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే, టికెట్ల రేట్ల పై ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త జీవోను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక తాజాగా సమాచారం ప్రకారం కమిటీ నివేదిక మేరకు ఏపీలో సినిమా టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉందని, యితే అవి ఏ మేరకు పెరుగుతాయనేది తెలియాల్సి ఉంది. తెలంగాణలో ఉన్నట్టుగా ధరలు ఉండాలని, తెలుగు చిత్ర పదిశ్రమ కోరుకుంటున్నారు. మరోవైపు ఆ స్థాయిలో టెకెట్ రేట్లు ఉండకపోవచ్చి సమాచారం. 5షోల విషయంలో మాత్రం, ఏపీ సర్కార్ సానుకూలంగానే ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం, ఈరోజు టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇక కొత్త జీవో అమల్లోకి వస్తే, టాలీవుడ్ నుండి వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.