Suman: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుంది: సుమన్
- By Balu J Published Date - 11:51 PM, Sat - 15 June 24

Suman: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.
గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం.. న్యూయార్క్ సిటీని తలపిస్తోందని.. దానికి కారణం చంద్రబాబేనని సుమన్ గుర్తు చేశారు. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వానికి ప్రజలు సహకారం చాలా అవసరం అన్నారు.