AP Cabinet Meeting : నేడు ఏపీ కెబినెట్ భేటీ.. వివిధ కీలకాంశాలపై చర్చించనున్న మంత్రివర్గం
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై
- By Prasad Published Date - 08:57 AM, Wed - 12 July 23

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దళితులకు భూ పంపిణీపై కెబినెట్లో చర్చకురానుంది. దళితులకు భూ పంపిణీపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేశారు. పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కొసం చేసుకున్న ఒప్పందాలను మంత్రివర్గం ఆమోదించనుంది. 15 వేల డీఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల పై కెబినెట్లో చర్చ జరిగనుంది. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. బేతంచర్ల, గుంతకల్, మైదుకూరు లలో పాలిటెక్నిక్ కళాశాలలు ప్రతిపాదనకు కెబినెట్ ఆమోదం తెలపనుంది. ఎస్సీఆర్టీలో ఖాళీల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. ఏపీలో ప్రముఖ హోటళ్ల నిర్మాణాలకు భూ కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. వివిధ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.