Virus: ఉప్పెనలా మరో వైరస్… పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం!
కరోనాతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జనాలకు మరో వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ టెన్షన్ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు.
- By Nakshatra Published Date - 08:00 PM, Thu - 9 March 23

Virus: కరోనాతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జనాలకు మరో వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ టెన్షన్ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్
ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ వైరస్ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గతంలో వచ్చి పోయినట్టు తెలిపారు.
ముక్కు నుంచి గొంతు వరకు దీని ప్రభావం ఉంటుందని డాక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఈ వైరస్ మ్యూటేషన్ అవుతూ వస్తోంది. మొదటి మూడు, అయిదు రోజులు జ్వరం వస్తుంది. చిన్నారులు, వృద్ధులకి ఈ వైరస్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని తెలిపారు. జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసులు నమోదైనట్టు తెలిపారు డాక్టర్ వినోద్ కుమార్. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. ఈ వైరస్ సోకితే విద్య ర్థులని స్కూళ్లకి పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ వైరస్ పై అనవసర అపోహలు వద్దుని, బయట నుంచి ఇంటికి రాగానే చేతులు తప్పనిసరిగా కడగడం మర్చిపోవద్దన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలని వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా
ఉన్న వారికి ఈ వైరస్ ద్వారా ఇన్ఫూయీంజా వ్యాపిస్తోందన్నారు. వైద్యుల సలహాల మేరకే యాంటిబయాటిక్స్ వాడాలన్నారు ఏపీ మెడికల్ ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.