HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Another New Scheme In Telangana Govt Minority Bandhu

Harish Rao: తెలంగాణలో మరో కొత్త పథకం.. త్వరలో మైనార్టీ బంధు

మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి శ్రీకారం చుట్టబోతోంది.

  • Author : Balu J Date : 21-07-2023 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ఇప్పటికే బీసీ, దళితులకు పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు మైనార్టీలకు పథకం అందించబోతోంది. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకంపై రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేస్తారని హరీష్ రావు పేర్కొన్నారు. జలవిహార్ లో జరిగిన మైనార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  బ్యాంకుల‌తో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని తెలిపారు మంత్రి హరీష్ రావు. మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారని, రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారని చెప్పారు హరీష్ రావు.

హిందువుల‌కు క‌ల్యాణ‌ లక్ష్మి అమ‌లు చేసిన‌ట్టే.. మైనార్టీల కోసం షాదీ ముబార‌క్ అమ‌లు చేస్తున్నామని గుర్తు చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ లో ఇంగ్లిష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉంద‌ని చెప్పారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నార‌ని పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వ‌హించాల‌ని అడిగిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక్క‌రే అని తెలిపారు హరీష్ రావు. ఎన్నికల పేరుతో బీజేపీ, కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతున్నాయని, ప్రజలు నమ్మవద్దని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • Minority Bandhu
  • telangana

Related News

    Latest News

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd