HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Anointing Lord Shiva All Good Results

Lord Shiva: శివునికి అభిషేకం చేయిస్తే చాలు.. అన్నీ శుభఫలితాలే!

శివునికి అభిషేకం (Puja) చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి.

  • Author : Balu J Date : 18-02-2023 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maha Shivaratri
Maha Shivaratri

శివుడు (Shiva) అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం (Puja) చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను సంతరించుకుంటుంది. ఆవుపాలతో శివుని (Shiva)కి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి.

మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం (Shiva) చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఆరోగ్యం చేకూరుతుంది. పంచదారతో చేయిస్తే దుఃఖం తొలగిపోతుంది. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు (priests) సూచిస్తున్నారు.

శివాభిషేక ఫలములు (Shiva)
1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • daily-puja
  • devotees
  • Lord Shiva
  • Maha Shivaratri 2023

Related News

Mahashivratri 2026

మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని అర్చించడం అత్యుత్తమమని శివ మహాపురాణం చెబుతోంది. ఈ పురాణం ప్రకారం.. ఎవరైతే పార్థివ శివలింగాన్ని పూజిస్తారో వారు ధనధాన్యాలు, ఆరోగ్యం, సంతాన సౌఖ్యాన్ని పొందుతారు.

  • Mahashivratri

    రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

  • Mahashivratri 2026

    మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd