Amrit Kalash Deposit Scheme: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ పునరుద్ధరించిన ఎస్బీఐ.. జూన్ 30 వరకు ఛాన్స్
400 రోజుల గడువుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు.
- Author : Maheswara Rao Nadella
Date : 18-04-2023 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
Amrit Kalash Deposit Scheme by State Bank of India : అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ తన లిమిటెడ్ ఆఫర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్ డిపాజిట్’ స్కీమ్ (Amrit Kalash Deposit Scheme) ను పునరుద్ధరించింది.ఏప్రిల్ 12న పునరుద్ధరించిన ఈ స్కీమ్ జూన్ 30వరకు అందుబాటులో ఉండనుంది. గత నెల మార్చి ఆఖరుతోనే ఈ స్కీమ్ గడువు ముగిసినా మళ్లీ పునరుద్ధరించారు.
400 రోజుల గడువుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు. ఖాతాదారులు గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిటివ్ చేసుకునే అవకాశం ఉంది. ‘అమృత్ కలశ్ డిపాజిట్’ స్కీమ్ లో నగదు డిపాజిట్ చేసే సాధారణ పౌరులకు 7.1శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ రేటు చెల్లిస్తారు. ఈ పథకం కింద డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టం కింద టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. స్వల్ప కాలిక లక్ష్యంతో డిపాజిట్ చేసే వారికి ఈ అమృత్ కలశ్ పథకంతో ప్రయోజనాలు ఉన్నాయి. మెచ్యూరిటీకి ముందే నగదు విత్ డ్రా చేసుకోవడంతో పాటు లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది.
డిపాజిట్లు..
అమృత్ కలశ్ పథకంతో NRI రూపీ టర్మ్ డిపాజిట్స్‌కు కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా కొత్త డిపాజిట్లకు , రెనివల్ డిపాజిట్లకు , టర్మ్ డిపాజిట్లకు , స్పెషల్ టర్మ్ డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నెలవారీగా, 3 నెలలకు ఓసారి, 6 నెలలకు ఓసారి ఎస్బీఐ చెల్లిస్తుంది.
వడ్డీరేట్లు..
ఇక ఎస్‌బీఐ సాధారణ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనిష్టంగా 3 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇక సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటుంది. ఇక SBI WE CARE డిపాజిట్ స్కీం కింద అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ లభిస్తుంది. SBI మరో స్పెషల్ డిపాజిట్ స్కీం సర్వోత్తమ్ ఎఫ్‌డీ కూడా ఉంది.