Amit Shah: నగరంలో అమిత్ షా…
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న అమిత్ షా
- Author : Praveen Aluthuru
Date : 23-04-2023 - 6:14 IST
Published By : Hashtagu Telugu Desk
Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న అమిత్ షాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యేలు రఘనందన్ రావు, ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు.
ఈ రోజు చేవెళ్లలో రాష్ట్ర బీజేపీ విజయసంకల్ప సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా షా వస్తున్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో అమిత్ షా గంట సేపు ప్రసంగించనున్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర బీజేపీ. ఇందుకోసం భారీగా జనసమీకరణ చేసింది. ఈ రోజు సభలో అమిత్ షా ప్రసంగంపై అన్ని పార్టీలు ఆతృతగా వేచి చూస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. అమిత్ షా గంటపాటు ప్రసంగించి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. ఆ తర్వాత ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లి పోతారు
కర్ణాటక, తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తున్నది. ఇప్పటికే ఈ విషయాన్నీ కేంద్ర పెద్దలు ప్రకటించారు. రాష్ట్ర అధికార పార్టీ ఫెయిల్యూర్స్ ని ఎండగడుతూ ప్రజలకు తమ ఎజెండాను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది బీజేపీ.
Read More: Rajahmundry: కారుతో బీభత్సం సృష్టించిన ఇంటర్ విద్యార్థి.. చివరికి?