HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Amaravati Farmers Welcome Workers As Construction Work Resumes

Amaravati: అమరావతి రైతుల హ్యాపీ

రాజధాని అమరావతి పనులు మళ్ళీ ప్రారంభించటంతో అక్కడి రైతులు సంతోషం పడుతున్నారు

  • Author : CS Rao Date : 24-04-2022 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Capital
Amravati

రాజధాని అమరావతి పనులు మళ్ళీ ప్రారంభించటంతో అక్కడి రైతులు సంతోషం పడుతున్నారు. నిర్మాణ కంపెనీల కార్మికులకు గులాబీలతో స్వాగతం పలికారు. మళ్ళీ చంద్రబాబు టైంలో జరిగిన నిర్మాణాలకు మోక్షం లభించింది.
అనూహ్యంగా మూడు రాజధానులు – సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ఉప సంహరించుకుంది. ఇక, కోర్టు ఇచ్చిన తీర్పులో అమరావతి కోసం రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అసెంబ్లీకి రాజధాని మార్పు నిర్ణయం తీసుకొనే అవకాశం లేదని రాష్ట్రపతి ఆమోదంతోనే రాజధాని మార్పు సాధ్యమని తేల్చి చెప్పింది. అదే సమయంలో అమరావతి నిర్మాణాలకు సమయం నిర్దేశించింది. దీని పైన అసెంబ్లీలోనూ చర్చ చేసారు. న్యాయస్థానం నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయలేమని స్పష్టం చేసింది. కోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసింది.

మూడు రాజధానులు కోర్టు తీర్పులు, రాజకీయ వ్యూహాల నడుమ అమరావతి లో మరోసారి కదలిక మొదలైంది. ప్రభుత్వ వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. ఆకస్మికంగా అమరావతిలో వచ్చిన కదలికతో స్థానిక రైతులు హ్యాపీగా ఫీలవుతున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత అనూహ్యంగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తర మీదకు తెచ్చింది. ఆ వెంటనే నెల రోజులకే అసెంబ్లీ – మండలిలో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశ పెట్టింది. మండలిలో వివాదం చోటు చేసుకుంది. ఆ తరువాత మూడు రాజధానుల వ్యవహారం – సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారం కోర్టుకు చేరింది.మూడు రాజధానులు..కోర్టు తీర్పులు రాజకీయ వ్యూహాల నడుమ అమరావతి లో మరోసారి కదలిక మొదలైంది.

ఆరు నెలలు కాదు, అరవై నెలలు సమయం కావాలని అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఇక, ఇదే సమయంలో రాజకీయంగా జగన్ ప్రభుత్వం 2024 ఎన్నికల కోసం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాల పూర్తి దిశగా కార్యాచరణ మొదలైంది. అందులో భాగంగా రాయపూడిలో తుదిదశలో ఉన్న భవన నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థను సీఆర్‌డీఏ కోరినట్టు తెలిసింది. గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్‌సీసీ సిబ్బంది పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్‌లో ఒక్కోదానిలో 6 చొప్పున అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు టైల్స్‌, మార్బుల్స్‌ పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరుగుతున్న పనుల ను అమరావతి రైతులు, దళిత, ముస్లింమైనార్టీ నేతలు పరిశీలించారు. లారీల్లో నుంచి మెటీరియల్‌ను దించుతున్న కార్మికులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. మొత్తం మీద అమరావతి రైతులు జగన్ పై తొలి విజయం సాధించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • constructions
  • farmers

Related News

Bill Gates to visit Amaravati Today

చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

Bill Gates  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం

  • Governor Abdul Nazeer Ap As

    ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

  • మీ బైక్ ఇంజన్ ఓవర్‌హీట్ అవుతుందా?

  • విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

  • AM/NS India : సరికొత్త ప్రీమియం స్టీల్ ఉత్పత్తులను ప్రవేశ పెట్టిన ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా’

  • ‘ The February Edit ‘ : ఇనార్బిట్ మాల్ లో ‘ది ఫిబ్రవరి ఎడిట్’ ఉత్సవం

Trending News

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd