HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ahmedabad Plane Crash Air India Police And Centre Issue Helpline Numbers

Ahmedabad Plane Crash: కుప్ప‌కూలిన విమానం.. ఎయిర్ ఇండియా రియాక్ష‌న్ ఇదే!

అహ్మదాబాద్ పోలీసు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా నంబర్‌లను జారీ చేసింది. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా రెండు ఫోన్ నంబర్‌లను జారీ చేసింది.

  • Author : Gopichand Date : 12-06-2025 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash: గుజరాత్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన (Ahmedabad Plane Crash) విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘానీ నగర్ ప్రాంతంలో జూన్ 12న మధ్యాహ్నం లండ‌న్‌కు వెళ్తున్న‌ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. విమానంలో 10 మంది క్రూ సభ్యులతో సహా 242 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్పటివరకు 133 మంది మరణించినట్లు వార్తలు వ‌స్తున్నాయి. చాలా మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఈ విషయంలో ఎయిర్ ఇండియా తరపున హెల్ప్‌లైన్ నంబర్ జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఎయిర్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం.., ప్రయాణికులకు సంబంధించిన సమాచారం కోసం 1800 5691 444 అనే ప్యాసింజర్ హాట్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులకు తాము పూర్తి సహకారం అందిస్తున్నామని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

Also Read: Balmuri Venkat: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై ఫిర్యాదు

Air India confirms that flight AI171, from Ahmedabad to London Gatwick, was involved in an accident today after take-off.

The flight, which departed from Ahmedabad at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft. Of these, 169 are…

— Air India (@airindia) June 12, 2025

అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 1:38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, క్రూ సభ్యులు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్ పౌరుడు, 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. కంపెనీ తమ ఎక్స్ హ్యాండిల్ https://x.com/airindia, http://airindia.com ద్వారా రెగ్యులర్ అప్‌డేట్‌ల ద్వారా మరిన్ని వివరాలను అందిస్తాన‌ని పేర్కొంది.

అహ్మదాబాద్ పోలీసు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా నంబర్‌లను జారీ చేసింది. ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా రెండు ఫోన్ నంబర్‌లను జారీ చేసింది. ఒక ప్రకటనలో ఫ్లైట్ AI171 దుర్ఘటన సందర్భంగా అన్ని వివరాలను సమన్వయం చేయడానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖలో ఒక ఆపరేషనల్ కంట్రోల్ రూమ్‌ను యాక్టివేట్ చేశామని తెలిపింది. కాంటాక్ట్ నంబర్లు 011-24610843, 9650391859. అంతేకాకుండా పోలీసు ఎమర్జెన్సీ సర్వీసెస్, సమాచారం కోసం అహ్మదాబాద్ సిటీ పోలీసు కూడా ఎమర్జెన్సీ నంబర్‌ను జారీ చేసింది. ప్రజలు 07925620359 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • Ahmedabad Air India Plane Crash
  • Ahmedabad Plane Crash
  • Air India Plane Crash
  • Air India Plane Crash Video
  • plane crash

Related News

Ajit Pawar Plane Crash

అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

Ajit Pawar  మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తోందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్‌లోని వాయిస్ రికా

  • Shambhavi Pathak.

    రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ ప‌వార్.. వైరల్ అవుతున్న పాత‌ ట్వీట్

  • Ajit Pawar Plane Crash

    విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!

  • Kinjarapu Rammohan Naidu

    అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు

  • Ajit Pawar

    అజిత్ ప‌వార్ సంపాద‌న ఎంతో తెలుసా?

Latest News

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పా ?

  • పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • బంగారం డిమాండ్ ఢమాల్

  • ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd