Watch Video: ప్రేమంటే ఇదేరా.. బేబీ ఎలిఫెంట్ వీడియో వైరల్!
మనుషులకు ఎమోషన్స్ ఉన్నట్టు... జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయి.
- By Balu J Published Date - 04:32 PM, Mon - 27 June 22

మనుషులకు ఎమోషన్స్ ఉన్నట్టు… జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయి. ఆగ్రహం, ఆనందం వాటికి సహజం. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రేమ, ఆప్యాయతను ఒలకబోస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే.. మీరు కచ్చితంగా జంతు ప్రేమికులుగా మారిపోతారు. పిల్ల ఏనుగు ఒకటి తన కీపర్‌తో కౌగిలించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్ 27న బ్యూటెంగేబిడెన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఎంతోమంది మనసులను దోచుకుంది. ఆ వీడియోను చూస్తే.. నిత్యం తన బాగోగులు చూసే కీపర్ పై పడి ఆనందం వ్యక్తం చేస్తుంది. అతడ్ని గట్టిగా హత్తుకొని తన తొండంతో ప్రేమగా ముద్దాడుతోంది. ప్రస్తుతం ఈ వీడియోకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దారి తప్పిపోయిన వచ్చిన అనాథ ఏనుగును పెంచుతుండటంతో ప్రతిఒక్కరూ ఆ వ్యక్తిని అభినందిస్తున్నారు.
https://twitter.com/buitengebieden/status/1541143804375351300?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1541143804375351300%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Fadorable-video-of-a-baby-elephant-cuddling-with-its-keeper-is-viral-watch-1967253-2022-06-27