Punjab Election Results: పంజాబ్‌లో సోనూ సోదరి ఓటమి..!
- Author : HashtagU Desk
Date : 10-03-2022 - 6:01 IST
Published By : Hashtagu Telugu Desk
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం దెబ్బకి, అక్కడ సీఎం అభ్యర్ధులతో పాటు సీనియర్ నాయకులు సైతం ఆప్ అభ్యర్ధుల చేతిలో ఓటమి చవి చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక కూడా ఓడిపోయారు. పంజాబ్‌లోని మెగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మాళవిక ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ చేతిలో ఏకంగా 58,813 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాళవికకు కేవలం 31,125 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇక తాజా ఎన్నికల్లో సిట్టింగ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు చోట్లు ఆప్ అభ్యర్ధుల చేతి దారుణంగా ఓటమి పాలయ్యారు. సీఎం చన్నీ క్యాబినేట్‌లో ఉన్న కీలక మంతులు కూడా ఆప్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ఆప్ చేతిలో భంగపాటు తప్పలేదు. మొత్తానికి పంజాబ్‌లో ఆప్ మెరుపుల దెబ్బకి పెద్ద పెద్ద ఉద్ధండ నేతలతో పాటు కోరా టైమ్‌లో హీరోగా మారిన సోనూ సోదరి కూడా ఓటమి పాలయ్యారు. ఇక పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో, శిరోమణి ఆకాళిదళ్ పార్టీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో పంజాబ్‌ను తొలిసారి ఆప్ సొంతం చేసుకుంది.