Pratap Pothen: నటుడు ప్రతాప్ పోతన్ ఇకలేరు
సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్(70) కన్నుమూశారు.
- By Balu J Published Date - 12:42 PM, Fri - 15 July 22

సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్(70) కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మరణవార్త తెలుసుకుని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.