Actor Marimuthu: జైలర్ నటుడు గుండెపోటుతో మృతి
ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ జి. మారిముత్తు (Actor Marimuthu) (57) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.
- By Gopichand Published Date - 10:57 AM, Fri - 8 September 23

Actor Marimuthu: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. జైలర్ నటుడు కన్నుమూశాడు. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ జి. మారిముత్తు (Actor Marimuthu) (57) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మారిముత్తు ఇప్పటివరకు వందకుపైగా సినిమాల్లో నటించారు. తాజాగా విక్రమ్, జైలర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా జైలర్ సినిమాలో విలన్ కి నమ్మకస్తుడి పాత్రలో మారుమూత్తు నటించిన సంగతి తెలిసిందే. మారిముత్తు మృతి నేపథ్యంలో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.