New Bengal CM: 2036లో బెంగాల్ సీఎం ఆయనే అంటూ ట్వీట్ చేసిన టీఎంసీ నేత
- Author : Hashtag U
Date : 03-05-2022 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి విజయం సాధించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ 2036లో బెంగాల్ ముఖ్యమంత్రిగా అభిషేక్ బెనర్జీ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. 2036 వరకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంటారని.. ఆ తరువాత మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టడం ద్వారా మమతా బెనర్జీ భారతదేశంలోనే ఆదర్శంగా నిలుస్తారన్నారు.
ఇదిలా ఉండగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో “విద్వేషపూరిత వ్యక్తులను తిరస్కరించినందుకు” రాష్ట్ర ప్రజలకు టీఎంసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. 2021లో ఈ రోజున బెంగాల్ ప్రజలు ద్వేషపూరిత వ్యక్తులను నిర్ణయాత్మకంగా తిరస్కరించారు. శాంతి, ఐక్యత, నిజమైన అభివృద్ధిని ఎంచుకున్నారని టీఎంసీ ట్వీట్ చేసింది.