AAG Ponnavolu : వైసీపీ ఘోర ఓటమి.. ఏఏజీ పొన్నవోలు రాజీనామా
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టకుంది. ఈ ఎన్నికల్ల 11 అసెంబ్లీ స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు ఆ పార్టీపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి.
- By Kavya Krishna Published Date - 10:58 AM, Thu - 6 June 24

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టకుంది. ఈ ఎన్నికల్ల 11 అసెంబ్లీ స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు ఆ పార్టీపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు లాంటి వారందరూ ఘోర ఓటమిని చవిచూశారు. వైసీపీలో వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు మినహా మిగితా వారంతూ ఓటమి పాలయ్యారు. వై నాట్ 175 అన్న వైసీపీ నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి తాము చేసిన తప్పేమిటో లెక్కలు వేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కొందరు వైసీపీ శ్రేణులు టీడీపీ కూటమి నేతలపై దాడికి దిగుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్లు అల్లర్లకు పాల్పడేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిలు తమ తమ పదవులుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరే కాకుండా.. వైసీపీ ఓటమిని భరించలేక పలువురు తమ రాజీనామాలు కొనసాగస్తున్నారు.
అయితే.. తాజాగా.. వైసీపీ ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండటంతో ఏజీపీలు, ఏపీపీలు కొద్దిరోజుల తర్వాత రాజీనామా చేసే ఛాన్సుంది.
Read Also : RK Roja : రోజా ఓటమి.. వైసీపీ నేతల సంబరం