Aadhaar Card: ఆధార్ కార్డ్ అప్డేట్స్ కి ఛార్జీలు ఎంతో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటిగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు
- By Nakshatra Published Date - 05:22 PM, Fri - 28 October 22
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటిగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు విషయంలో ఏదైనా సమస్యలు చిన్నచిన్న మార్పులు ఉన్నప్పుడు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళుతూ ఉంటారు. అప్పుడు ఆధార్ అప్డేట్ కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే అప్డేట్ కోసం రుసుము ఎంత ఇవ్వాలి అన్నది ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియక ఆధార సెంటర్లో ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బు ఇస్తూ ఉంటారు.
కాగా ఈమధ్య కాలంలో అయితే ఆధార మార్పుకు ఆధార్ సెంటర్ లలో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఏ ఏ అప్డేట్ కి ఎంత రుసుము చెల్లించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 0-5 సంవత్సరాల లోపు వారికీ ఆధార్ సంఖ్య జనరేషన్ ఉచితం. అలాగే ఆధార్ సంఖ్య జనరేషన్ 5 ఏళ్లు పైబడిన వారికీ కూడా ఉచితం. బయోమెట్రిక్ అప్డేట్ కూడా ఉచితంగానే ఇందుకోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర బయోమెట్రిక్ అప్డేట్ లు అనగా డెమోగ్రాఫిక్ అప్డేట్ లు అయితే 100 చెల్లించాల్సి ఉంటుంది.
జనాభా నవీకరణ కోసం అయితే 50 రూపాయలు చెల్లించాలి.గుర్తింపు రుజువు లేదా నివాస రుజువు లో అప్డేట్ కోసమే అయితే 50 రూపాయలు చెల్లించాలి. గుర్తింపు లేదంటే నివాస ధృవీకరణ పత్రం అప్డేట్ కోసం 25 రూపాయల రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే బాల ఆధార్ విషయానికి వస్తే.. పిల్లల వయసు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వారికి బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. ఆ చిన్న పిల్లల ఆదార్ సమాచారం వారి తల్లిదండ్రుల ఆధారంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆధార్ కి అనుసంధానంగా ఆ పిల్లల ఆధార వివరాలను నమోదు చేస్తారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు మధ్య ఉన్నప్పుడు ఆ పిల్లల పదివేలు, ఐస్పేస్ రికగ్నైజేషన్ అప్డేట్ చేస్తారు.
Related News
Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్తర్వులు జారీ..!
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.