Vizag : ఏఎస్ఐ సత్యనారాయణ పై దాడి చేసిన ఓ యువతి..!
నడిరోడ్డు పై బీరు తాగుతూ సిగరెట్ కాలుస్తుందని ప్రశ్నించిన పోలీసులు. దీంతో ఏఎస్‌ఐ (ASI)
- Author : Maheswara Rao Nadella
Date : 15-12-2022 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నంలో (Vizag) పోలీసుల్ని దుర్భాలాడుతూ రెచ్చిపోయిన యువతి. నడిరోడ్డు పై బీరు తాగుతూ సిగరెట్ కాలుస్తుందని ప్రశ్నించిన పోలీసులు. దీంతో ఏఎస్‌ఐ (ASI) పై యువతి బూతు పురాణం, కాలి తో తన్నేందుకు ప్రయత్నించింది. ASI పై బీరు బాటిల్ తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మరో యువకుడి కంటి కి గాయం అయ్యింది. ఆమెను పోలీస్ స్టేషన్ (Police Station) కు తీసుకెళ్లిన తర్వాత కూడా నోరు పారేసుకుంది. ప్రియుడి పేరు చెప్పి బెదిరించే ప్రయత్నం.
విశాఖపట్నంలో (Vizag) గంజాయి మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. వైఎంసీఏ దగ్గర మద్యం, గంజాయి మత్తులో అర్ధరాత్రి హల్చల్ చేసింది. యువతి నడిరోడ్డుపై బీరు తాగుతూ గంజాయి సిగరెట్ కాలుస్తుందని తెలియడంతో త్రీ టౌన్ ఏఎస్ఐ పీవీవీ సత్యనారాయణ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన యువతి బీర్ బాటిల్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఏఎస్ఐ సత్యనారాయణపై బీర్ బాటిల్ విసరగా.. అది గోవింద్ అనే యువకుడు కంటికి తగిలింది. దీంతో అతడి కంటికి గాయం అయ్యింది.
యువతిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వాళ్లపై విరుచుకుపడింది. ఏఎస్‌ఐపై బూతుపురాణం అందుకుంది.. తీవ్రంగా దుర్భాషలాడింది. ఏఎస్ఐ సత్యనారాయణపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన్న కాలితో తన్నేందుకు ప్రయత్నించింది. ఇదంతా చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువతిపై గోవింద్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఏఎస్ఐ సత్యనారాయణను యువతి అనవసరంగా దుర్భాషలాడిందని.. మరికొందరు యువకులు కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ యువతి తన ప్రియుడు దుర్గాప్రసాద్ అలియాస్ ఏటీఎం అనే వ్యక్తికి ఈ విషయం చెబితే మీ పని అయిపోతుందని బెదిరింపులకు దిగింది. ‘పోలీసులైతే నన్ను మీరేం చేయగలరు’ అంటూ బూతులతో రెచ్చిపోయింది.. సవాల్ చేస్తూ నానా హంగామా చేసింది.
Also Read: Relationship Tips : ఈ 5 విషయాలను తెలుసుకున్న తరువాతే రిలేషన్ షిప్ లోకి వెళ్ళండి..