HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >A Serial Killer Monster Amelia Dyer Who Mauled 400 Babies

Amelia Dyer : 400 మంది పసికందుల్ని పొట్టన పెట్టుకున్న సీరియల్ కిల్లర్

ఈ రోజు మనం 1896లో బ్రిటన్‌ (Britain) లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం.

  • By Hashtag U Published Date - 08:00 PM, Sat - 31 December 22
  • daily-hunt
Amelia Dyer Serial Killer
Amelia Dyer Serial Killer

Amelia Dyer : ఈ రోజు మనం 1896లో బ్రిటన్‌లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన పిల్లల పెంపకానికి సంబంధించినది. నిజానికి ఆ రోజుల్లో బ్రిటన్‌లో కొంత మంది డబ్బు చెల్లించి తమ పిల్లలను పెంపకం కోసం బేబీ ఫార్మింగ్ హౌస్ లకు ఇచ్చేవాళ్ళు. నిర్ణీత సమయం తర్వాత బేబీ ఫార్మింగ్ హౌస్ నిర్వాహకులు ఆ పిల్లలను వాళ్ళ పేరెంట్స్ కు లేదా గార్డియన్స్ కు తిరిగి అప్పగించే వాళ్ళు. అయితే కొన్ని బేబీ ఫార్మింగ్ హౌస్ ల నిర్వాహకులు మాత్రం డబ్బులు తీసుకుని పిల్లలను ఎప్పటికీ తమ వద్దే ఉంచుకునేవారు. తర్వాత సొంత పిల్లలు లేని పేదవాళ్లకు అమ్మేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పిల్లల వ్యాపారమే. అయితే ఒక మహిళ బేబీ ఫార్మింగ్ హౌస్ వ్యాపారాన్ని దుర్వినియోగం చేసింది. తనకు ఎంతోమంది తల్లిదండ్రులు అప్పగించిన 400 మంది పిల్లల్ని రాక్షసంగా చంపేసింది. డబ్బు దురాశ వల్లే ఇలా చేసింది. దీనిపై ప్రత్యేక కథనమిది..

1896 ఏప్రిల్ 4న ఏమైంది?

1896 ఏప్రిల్ 4న ఒక మత్స్యకారుడు లండన్ లోని థేమ్స్ నదిలో చేపలు పట్టేటప్పుడు.. ప్యాకెట్‌లో చుట్టబడిన ఒక చిన్నారి మృతదేహాన్ని చూశాడు. ఆ శిశువు వయస్సు ఒక సంవత్సరం కంటే తక్కువ. మెడకు తెల్లటి టేపు చుట్టి ఉంది. ఈ టేపుతో శిశువు గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. శిశువు మృతదేహంతో పాటు ఒక కాగితం కూడా ఉంది. అందులో ఒక ఇంటి చిరునామా రాయబడి ఉంది. దీంతో మత్స్యకారుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆ పేపర్‌లో రాసి ఉన్న అడ్రస్‌కి వెళ్లారు. అది అమేలియా డయ్యర్ (Amelia Dyer) అనే మహిళ చిరునామా.  పోలీసులు అమేలియా ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అక్కడ మానవ మాంసం వాసన వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఆ ఇంట్లో సోదా చేయగా.. చాలా టీకా పేపర్లు, చిన్న పిల్లల బట్టలు కనిపించాయి.  దీనితో పాటు కొన్ని వార్తాపత్రికలను గుర్తించారు. అందులో ఈ మహిళ శ్రీమతి హర్బింగ్.. శ్రీమతి స్మిత్‌.. సహా అనేక పేర్లతో ఇచ్చిన బేబీ ఫార్మింగ్ ప్రకటనలు ఉన్నాయి. నదిలో దొరికిన శిశువు మృతదేహం మెడ చుట్టూ ఉన్న తరహా టేపులను కూడా పోలీసులు ఆ ఇంట్లో గుర్తించారు.

నదిలో మృతదేహాల గుట్ట:

థేమ్స్ నదిలో చాలా మంది చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు నిర్వహించిన ఆ లాగింగ్ ఆపరేషన్ లో నది నుండి 50 మంది పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. దీనిపై పోలీసులు అమీలియాను ఇంటరాగేట్ చేశారు. ఎందుకు ఇలా పిల్లల్ని చంపారు అని అడిగారు. దీంతో అమీలియా నోరు విప్పింది. డబ్బుపై దురాశతోనే ఇలా చేశానని స్పష్టం చేసింది. పిల్లలు అరవకుండా వాళ్ళ నోటికి టేప్ పెట్టి.. మెడకు కూడా టేప్ పెట్టి గొంతు నులిమి చంపానని చెప్పింది. తన బ్యాక్ గ్రౌండ్ గురించి పోలీసులకు వివరించింది.

అమేలియా (Amelia Dyer) బ్యాక్ గ్రౌండ్ ఇదీ:

24 ఏళ్ల అమేలియా 59 ఏళ్ల థామస్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రశ్న అమేలియా ఈ పిల్లలను ఎందుకు చంపింది? ఆపై కఠినమైన విచారణలో, అమేలియా తన కథను పోలీసులకు చెప్పడం ప్రారంభించింది. ఆమె 1837 లో జన్మించింది. 5 మంది తోబుట్టువులలో అమేలియా చిన్నది. తల్లి మానసిక పరిస్థితి బాగోలేక పోవడంతో బాల్యం బాగోలేదు. ఆమె తన తల్లి బాగోగులు చూసుకునేది.  1848లో ఆమె తల్లి మరణించింది. దీని తర్వాత ఆమె బ్రిస్టల్‌లో తన అత్తతో కలిసి జీవించడం ప్రారంభించింది.  1861లో, ఆమెకు 24 ఏళ్లు వచ్చినప్పుడు, ఆమె జార్జ్ థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ సమయంలో జార్జ్ వయస్సు 59 సంవత్సరాలు.  ఇద్దరూ వివాహ ధృవీకరణ పత్రంలో తమ వయస్సులను తప్పుగా రాశారు. జార్జ్ తన వయస్సును 48గా పేర్కొన్నాడు. అయితే, అమేలియా తన వయస్సును 30గా పేర్కొంది.

కూతురి కోసం నర్సింగ్ ఉద్యోగాన్ని వదిలేసిన అమీలియా పెళ్లి తర్వాత అమీలియా నర్సింగ్ శిక్షణ తీసుకుంది. వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తర్వాత అమీలియా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురి పేరు ఎలెన్ థామస్. కుమార్తెను చూసుకోవడానికి ఆమెకు సమయం లేదు. దాంతో ఆమె నర్సింగ్ ఉద్యోగం మానేసింది.  అంతా బాగానే జరిగింది. కానీ 1869లో భర్త జార్జ్ థామస్ మరణించాడు. దీని తరువాత, అమేలియా మరింత డబ్బు కొరతను ఎదుర్కోవడం ప్రారంభించింది. డబ్బు కోసం బేబీ ఫార్మింగ్ ప్రారంభించింది. డబ్బు తీసుకుని కొంత కాలం పిల్లలను చూసుకునేది. నిర్ణీత సమయం తర్వాత పిల్లలను తల్లిదండ్రులకు తిరిగి ఇచ్చేది.

పిల్లలు ఆకలితో చనిపోయారు:

1872లో ఆమె బ్రిస్టల్ నగరంలో మద్యం తయారీ పనిచేసే విలియం డయ్యర్‌ను పెళ్లి చేసుకుంది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి పేర్లు మేరీ ఆన్ మరియు విలియం శామ్యూల్. కొంతకాలం తర్వాత ఆమె కూడా విలియం డయ్యర్‌తో విడాకులు తీసుకుంది. ఇప్పుడు బేబీ ఫార్మింగ్ చేయగా వచ్చే డబ్బుతోనే తన ముగ్గురు పిల్లలను పోషించేది. అలాంటి పరిస్థితిలో ఆమె మనసులో దురాశ వచ్చి సంరక్షణ కోసం వదిలిపెట్టిన పిల్లల ఆరోగ్యంతో ఆడుకోవడం ప్రారంభించింది. ఆమె వారికి ఆహారం ఇవ్వలేదు. దీంతో పిల్లలు ఆకలితో చనిపోయారు.  కొంతకాలం బాగానే నడిచింది. అయితే ఓ చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు విచారణ చేయగా.. అమేలియా (Amelia Dyer) నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందినట్లు తేలింది. విషయం పోలీసుల దాకా వెళ్లగా.. అమేలియా నిర్లక్ష్యం వల్లే చాలా మంది చిన్నారులు బలి అయ్యారని విచారణలో తేలింది. దీంతో 6 నెలల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత అమేలియా విడుదలైంది. ఆమెకు వ్యతిరేకంగా ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో ఇంత త్వరగా జైలు నుంచి రిలీజ్ అయింది.

జైలు నుంచి విడుదల అయ్యాక:

పిల్లలను కొంత కాలం పాటు సంరక్షణ కోసం ఉంచితే, వాళ్ళను చంపలేమని అమీలియా అర్థం చేసుకుంది. అందుకే ఇప్పుడు న్యూస్ పేపర్లలో రకరకాల పేర్లతో ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనిలో ఎప్పటికీ పిల్లలను పెంచడం గురించి రాసింది. దీంతో వందలాది మంది ఆమె దగ్గర తమ పిల్లల్ని చేర్పించారు. అమేలియా తమ పిల్లలను ఎప్పటికీ చూసుకుంటుంది అని వారు అనుకున్నారు.  కానీ అమేలియా తమ పిల్లలతో ఏమి చేయబోతోందో వారికి తెలియదు. ఇప్పుడు అమేలియా పిల్లలను దత్తత తీసుకున్న కొద్ది గంటలకే చంపేయడం మొదలుపెట్టింది. చంపాక వారి మృతదేహాలను నదిలో విసిరేసేది.కొంతమంది పిల్లలను నది ఒడ్డున పాతి పెట్టేది. ఈ కేసులో 1896 జూన్ 10న అమేలియాను ఉరితీశారు.  డైలీ మెయిల్ ప్రకారం, అమేలియా 400 మందికి పైగా పిల్లలను చంపినట్లు పోలీసులు అంచనా వేశారు. మరణానికి ముందు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని పోలీసులు అడగగా.. ‘నేను చెప్పడానికి ఏమీ లేదు’ అని అమేలియా స్పష్టం చేసింది.

Also Read:  Alcohol : మిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మద్యాన్ని దూరంపెట్టాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • babies
  • crime
  • murder
  • Serial Killer

Related News

Murder

Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..

Tragedy: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు నేరాల తీవ్రత పెరుగుతూ, ఘోర ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd