Hyderabad: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి, బాలుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడుల పెరుగుతూనే ఉన్నాయి.
- Author : Balu J
Date : 15-12-2023 - 1:23 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిపక్కలవారు అలర్ట్ కావడంతో కొద్దిలో ప్రాణప్రాయం తప్పింది. అయినప్పటికీ బాలుడు గాయపడ్డారు. ఓ అపార్ట్ మెంట్ లో బాలుడు తన స్నేహితులతో ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. బాలుడు తప్పించుకునేందుకు పరుగులు తీసినా కుక్క వెంటపడి కరిచింది. చుట్టుపక్కలవాళ్లు అలర్ట్ కావడంతో పెద్ద నష్టం తప్పింది. కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అంతేకాదు.. గత నెల హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీధికుక్క దాడి కారణంగా ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో బాలుడు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో సంఘటనలో, నగరంలో ఐదేళ్ల బాలుడు వీధికుక్కల దాడికి గురయ్యాడు. ఇక హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కోమళ్ల మహేశ్వరి అనే 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన జరిగింది. గతంలో తెలంగాణలో వీధికుక్కల దాడులు జరిగినప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి
#boy severly injured in stray dog attack at Dilsukhnagar, #Hyderabad @DeccanChronicle @oratorgreat @GHMCOnline pic.twitter.com/bScOGNn94j
— Pinto Deepak (@PintodeepakD) December 15, 2023