8 Years Old Boy : రాజన్న – సిరిసిల్ల జిల్లాలో విషాదం.. గుండెపోటుతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి
పాఠశాలలో మధ్యాహ్న భోజనం క్యూలో నిలబడిన మూడో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ...
- Author : Prasad
Date : 26-10-2022 - 11:26 IST
Published By : Hashtagu Telugu Desk
పాఠశాలలో మధ్యాహ్న భోజనం క్యూలో నిలబడిన మూడో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ హృదయ విదారకమైన ఈ సంఘటన రాజన్న-సిరిసిల్ల బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లిలో మూడో తరగతి చదువుతున్న బుర్ర కౌశిక్ (8) అనే విద్యార్థి మధ్యాహ్న భోజన క్యూ లైన్‌లో నిలబడి కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు కారణంగానే బాలుడు మరణించాడని డాక్టర్లు తెలిపారు.