Maharashtra : నాసిక్ లో ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 11 మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం రాత్రి బస్సులో మంటలు చెలరేగాయి...
- By Prasad Published Date - 07:17 AM, Sat - 8 October 22

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి బస్సు ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగాయి. కనీసం 11 మంది మరణించగా, 20 మంది గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతామణి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు యావత్మాల్ నుండి ముంబైకి వెళ్తుండగా ఔరంగాబాద్ రోడ్‌లోని కైలాస్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ట్రక్కును ఢీకొనడంతో బస్సులో మంటలు వ్యాపించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ చిన్నారి సహా మరో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దురదృష్టకర ఘటనలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారని మంత్రి దాదా భూసే ధృవీకరించారు. పరిస్థితిని అంచనా వేయడానికి తాను కూడా సంఘటన స్థలానికి వెళుతున్నానని తెలిపారు.