Modi-Biden-Human Rights : మానవ హక్కులపై మోడీని ప్రశ్నించండి.. బైడెన్ కు ఆ 75 మంది లేఖ
Modi-Biden-Human Rights : భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్ నేతృత్వంలో 75 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రెసిడెంట్ జో బైడెన్ కు ఒక లేఖ రాశారు.
- Author : Pasha
Date : 21-06-2023 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
Modi-Biden-Human Rights : భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్ నేతృత్వంలో 75 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రెసిడెంట్ జో బైడెన్ కు ఒక లేఖ రాశారు. భారత్‌లో మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకార వైఖరిని అవలంభిస్తోందని వారు ఆరోపించారు. తాము భారత్‌లోని ఏ రాజకీయ పార్టీని కానీ.. నాయకుడిని కానీ సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం లేదని తేల్చిచెప్పారు. అమెరికా విదేశాంగ విధానంలోని ముఖ్యమైన సిద్ధాంతాలైన మానవ హక్కుల రక్షణ, మీడియా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, బహుళత్వం అనే అంశాలను మీటింగ్ సందర్భంగా మోడీకి గుర్తు చేయాలని ప్రెసిడెంట్ బైడెన్ కు(Modi-Biden-Human Rights) వారు విజ్ఞప్తి చేశారు.
Also read : PM Modi-NewYork hotel : న్యూయార్క్ లో మోడీ బస చేస్తున్న హోటల్ విశేషాలు
“అమెరికాలో అమలయ్యే ఈ విధానాలను మిత్ర దేశమైన భారత్ లో కూడా అమలు చేయాలని ప్రధాని మోడీని కోరండి” అని లేఖలో కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. పరమత సహనం లేకపోవడం, పౌర హక్కుల నాయకులను, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం వంటి ఘటనలు భారత్ లో ఇప్పుడు సర్వ సాధారణంగా మారాయని 75 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు.