Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఏడుగురు దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాయ్‌గఢ్‌లోని ఖోపోలీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది.
- Author : Gopichand
Date : 15-04-2023 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాయ్‌గఢ్‌లోని ఖోపోలీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.
Also Read: Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడి.. 8 మంది మృతి.. 21 మందికి గాయాలు
Maharashtra| 7 people died & more than 25 injured after a bus fell into a ditch in Raigad's Khopoli area. Rescue operations underway: Raigad SP pic.twitter.com/kneqn5M4A5
— ANI (@ANI) April 15, 2023
ముంబై-పూణే ఓల్డ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై నుంచి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఖోపోలి ప్రాంతంలోని షింగ్రోబా ఆలయం వెనుక ఉన్న లోయలో పడిపోయింది. రాయ్‌గఢ్ ఎస్పీ ప్రకారం.. బస్సులో 40 నుండి 45 మంది ఉన్నారు. వారిలో ఏడుగురు మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ ఇంకా కొనసాగుతోంది. బస్సును తొలగించేందుకు క్రేన్‌ను రప్పించారు. బస్సులో గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఒక సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారు ఒక కార్యక్రమం కోసం పూణే వెళ్లి పూణే నుండి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.