Kamareddy: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి, నలుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి, నలుగురికి గాయాలు
- By Balu J Published Date - 04:50 PM, Sat - 18 December 21

శనివారం మధ్యాహ్నం కామారెడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడపాగల్ మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద నిలిచిన లారీని బాధితులు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. ఏపీ12సీ5580 నంబరు గల బొలెరోలో నాందేడ్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితులను గూడూరు మండలం బొడ్డుగొండకు చెందిన ముఖేష్, కేసముద్రం మండలం ఏనుగుర్తికి చెందిన చందు, జార్కండ్‌కు చెందిన అఖీమ్‌గా గుర్తించారు.