Krishna River: కృష్ణాజిల్లాలో విషాదం..ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు సోమవారం కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైయ్యారు.
- By Hashtag U Published Date - 12:46 PM, Tue - 11 January 22

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు సోమవారం కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైయ్యారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన జెట్టి అజయ్ (12), జెర్రి పోతుల చరణ్ (13), కర్ల బాల యేసు (12), మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో వీరంతా కృష్ణానదిలో ఈతకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.ఆ సమయంలో ఐదుగురు విద్యార్థులు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టి ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మిగిలిని ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు కొట్లుకుపోతున్నాయని పోలీసులు తెలిపారు. చిన్నారులు నదిలో మునిగిపోవడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.