Firing: అమృత్ సర్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకం.. ఐదుగురు మృతి
పంజాబ్‌లోని అమృత్ సర్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఖాసా బీఎస్‌ఎఫ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘర్షణలో ఐదుగురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సిబ్బంది మరణించగా
- By Hashtag U Published Date - 02:20 PM, Sun - 6 March 22
పంజాబ్‌లోని అమృత్ సర్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఖాసా బీఎస్‌ఎఫ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘర్షణలో ఐదుగురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సిబ్బంది మరణించగా.. మరో బీఎస్ఎఫ్ జవాన్‌కు తీవ్రగాయాలైయ్యాయి. సీటీ సత్తెప్ప అనే జవాన్ తన తోటి జవాన్ లపై కాల్పులు జరిపారపగా..ఐదుగురు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సీటీ సత్తెప్ప ఎస్‌కే కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బీఎస్‌ఎఫ్ తెలిపింది. ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.