300 People Stranded: కొండచరియల కల్లోలం.. చిక్కుకుపోయిన 300 మంది
లిపులేఖ్ - తవాఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకు పోయింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణంలో ఉన్న కనీసం 300 మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
- Author : Pasha
Date : 01-06-2023 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
300 People Stranded in Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో లిపులేఖ్ – తవాఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకు పోయింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణంలో ఉన్న కనీసం 300 మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. లఖన్‌పూర్ సమీపంలో కొండ చరియలు పెద్దఎత్తున విరిగి రోడ్డుపై పడటంతో.. లిపులేఖ్ – తవాఘాట్ రహదారిని మూసివేశారు. ఆ రూట్ లో జర్నీ చేస్తున్న ప్రయాణికులు ధార్చుల, గుంజి ప్రాంతాల్లో చిక్కుకు పోయారు. రెండు రోజుల తర్వాత ఈ రహదారిలో ట్రాఫిక్ రాకపోకలు మొదలయ్యే ఛాన్స్ ఉంది.
యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ యాత్రకు వచ్చే భక్తులందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని స్థానిక పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.”యాత్రికులు దయచేసి సురక్షిత ప్రదేశాలలో ఉండండి. అనవసరంగా ప్రయాణించవద్దు. సురక్షిత ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయండి. వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించండి” అని వార్నింగ్ ఇచ్చారు. “యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ యాత్రకు వచ్చే భక్తులందరూ వాతావరణ సూచన తీసుకున్న తర్వాత తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో రెయిన్ కవర్, గొడుగు మరియు ఉన్ని/వెచ్చని దుస్తులను తమతో ఉంచుకోవాలి” అని నిర్దేశించారు.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హార్ద్వార్, నైనిటాల్, పితోర్‌గఢ్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ మరియు ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తుఫాను, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Condoms to Funerals: అంత్యక్రియలకూ కండోమ్ తీసుకెళ్తున్నారట.. ఎందుకంటే?