Hyderabad: స్కూల్ బస్సు చక్రాల కింద పడి మృతి చెందిన మూడేళ్ళ చిన్నారి
హైదరాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. బస్సు ఢీకొని మూడేళ్ళ చిన్నారి ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు
- Author : Praveen Aluthuru
Date : 02-11-2023 - 2:54 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. బస్సు ఢీకొని మూడేళ్ళ చిన్నారి ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు
రంగారెడ్డిలోని హయత్‌నగర్‌లోని కుంట్లూర్‌లో గురువారం జరిగిన హృదయ విదారక ఘటనలో మూడేళ్ల బాలుడు పాఠశాల బస్సు చక్రాల కింద నలిగిపోయాడు మూడేళ్ళ పవన్ హర్ష కుమార్ తన సోదరితో కలిసి పాఠశాల బస్సు వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలో పవన్ హర్ష కుమార్ సోదరి బస్సు ఎక్కింది. కానీ ఆ చిన్నారి పవన్ అమాయకంగా బస్సు డోర్ దగ్గర నిలబడి ఉండగా, ఇది గమనించని బస్సు డ్రైవర్ ఒక్క సారిగా బస్సును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలో సదరు బాలుడు కుదుపుకు లోనయి కిందపడ్డాడు. బస్సు చక్రాల కింద చిన్నారి నలిగిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్ర సింగ్ మాట్లాడుతూ.. సోదరి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మూడేళ్ళ పవన్ హర్షకుమార్ ఇంటి నుంచి బస్సు వద్దకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందినట్లు తెలిపాడు. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారి వెల్లడించారు.
Also Read: Minister Roja Photographer : తిరుమలలో మంత్రి రోజా అనుచరుడు అన్యమత ప్రచారం..!