3 Killed : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఏసీ కంప్రెషర్ పేలి..!
మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అలీబాగ్‌లోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్‌సిఎఫ్)...
- By Prasad Published Date - 10:19 PM, Wed - 19 October 22

మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అలీబాగ్‌లోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్‌సిఎఫ్) ప్లాంట్‌లో బుధవారం సాయంత్రం ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పేలడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు. రాయ్‌గఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి 100కి.మీ దూరంలో ఉన్న అలీబాగ్‌లోని థాల్‌లోని ఆర్‌సిఎఫ్ యూనిట్‌లో ఒక ఎయిర్ కండీషనర్‌ను రిపేర్ చేస్తుండగా, సాయంత్రం 4.45 గంటల సమయంలో అకస్మాత్తుగా ఎసి కంప్రెసర్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించారు, మరో ముగ్గురు గాయపడినట్లు రాయ్‌గఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. అలీబాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేస్తామని తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.