Tamil Nadu: తమిళనాడులో విషాదం: బాణాసంచా పేలి ఇద్దరు మృతి
వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ అవకాశముంది. ఈ మధ్య అలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది
- Author : Praveen Aluthuru
Date : 18-05-2023 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
Tamil Nadu: వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ అవకాశముంది. ఈ మధ్య అలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్ జిల్లా శివకాశిలో బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన కుమరేశన్, సుందరరాజన్ మృతి చెందారు.
#WATCH | Tamil Nadu | Two people died in an explosion at a firecracker manufacturing factory at Sivakasi in Virudhunagar district. Details awaited. pic.twitter.com/HtiMLc70fR
— ANI (@ANI) May 18, 2023
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విరుదునగర్ జిల్లాలోని శివకాశి నగరం భారతదేశంలో బాణసంచా తయారీదారుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
Read More: Sikkim Bus Accident: సిక్కింలో బస్సు బోల్తా… 26 మంది విద్యార్థులకు గాయాలు