Bus Overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 55 మందికి గాయాలు
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ (Raigad)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడి (Bus Overturns) ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 55 మందికి పైగా గాయపడ్డారు.
- By Gopichand Published Date - 09:59 AM, Sat - 30 December 23

Bus Overturns: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ (Raigad)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడి (Bus Overturns) ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 55 మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మాంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్హాని ఘాట్ ప్రాంతంలో ట్రావెల్ బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందగా, 55 మంది గాయపడ్డారని రాయ్‌గఢ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
Also Read: Lakhbir Singh Landa: లఖ్బీర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్.. ఎవరీ లఖ్బీర్ సింగ్ లాండా..?
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పూణె నుంచి కొంకణ్‌కు స్కూల్ ట్రిప్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చాలా మంది పిల్లలు బస్సులో ఉన్నట్లు సమాచారం. పూణె-మంగావ్‌ల మధ్య తామ్‌హిని ఘాట్‌లో ఓ మలుపు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొండేఘర్ గ్రామ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన తరువాత మంగావ్ నుండి రెస్క్యూ టీమ్‌లు, అంబులెన్స్‌లను అధికారులు సంఘటనా స్థలానికి పంపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.