Road Accident : హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం..18 ఏళ్ల యువకుడు మృతి
హైదరాబాద్ పహాడీషరీఫ్ రోడ్డులోని ఎర్రకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది...
- Author : Prasad
Date : 14-09-2022 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ పహాడీషరీఫ్ రోడ్డులోని ఎర్రకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మహ్మద్ అద్నాన్(18) షాహీన్‌నగర్ నివాసం ఉంటున్నాడు. ఓ దుకాణంలో ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు తన స్కూటీపై వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఎర్రకుంట రోడ్డు వద్ద లారీ యాక్టివాను ఢీకొట్టింది. యువకుడు యాక్టివాపై నుంచి కిందపడి లారీ కింద పడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.