Nipah Virus: కేరళలో నిపా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి
కేరళలోని మలప్పురం జిల్లాలో నిపా వైరస్ కేసు నమోదైందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
- Author : Praveen Aluthuru
Date : 21-07-2024 - 6:57 IST
Published By : Hashtagu Telugu Desk
Nipah Virus: కేరళలోని మలప్పురం జిల్లాలో నిపా వైరస్ కేసు నమోదైందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (AES) లక్షణాలను చూపించాడు. అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడు కోజికోడ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నమూనాలను ఎన్‌ఐవి (పూణె)కి పంపామని, అక్కడ నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజారోగ్య చర్యలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించింది. ఇది కాకుండా మరణించిన వారితో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించి, పరీక్షించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. గత 12 రోజులలో రోగితో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించి, వాళ్లని ఇంట్లోనే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిచింది.
Also Read: Venu Swamy : అతి త్వరలో రకుల్ విడాకులు – బాంబ్ పేల్చిన వేణు