Venu Swamy : అతి త్వరలో రకుల్ విడాకులు – బాంబ్ పేల్చిన వేణు
రకుల్ ప్రీత్ సింగ్‌కి పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని ఇప్పటికే చెప్పాను. మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను
- By Sudheer Published Date - 06:51 PM, Sun - 21 July 24

ఈ మధ్య జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswami) పేరు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ వార్తల్లో నిలుస్తుంటారు. వేణు స్వామి చెప్పిన జాతకాలలో కొన్ని నిజం కాగా చాలావరకు అబద్దం అయ్యాయి. అయినప్పటికీ ఎప్పటికి ఈయన పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చిత్రసీమ (Film Industry )కు సంబదించిన నటి నటులతో పరిచయాలు..వారిచేత పూజలు చేయించడం..వారి జాతకాలను తెలియజేస్తుండడం తో సినీ లవర్స్ ఎక్కువగా ఈయన్ను ఫాలో అవుతూ..ఈయన చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఈయన రకుల్ ప్రీతీ సింగ్ అతి త్వరలో విడాకులు (Rakul preet Singh divorce) తీసుకోబోతుందని తెలిపి షాక్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈయన రకుల్ జాతకం గురించి చెప్పుకొచ్చాడు. రకుల్ ప్రీత్ సింగ్‌కి పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని ఇప్పటికే చెప్పాను. మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను. ఈమె మరో ఆరు నెలల్లో విడాకులు తీసుకుంటుంది. పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో భర్త జాకీ భగ్నాని పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అందులో పని చేసే వాళ్ళకి శాలరీ ఇవ్వడం లేదని చెప్పడం, అలాగే ఆ బ్యానర్ పై చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటివి జరిగాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు కూడా మరో ఆరు నెలల్లో ఉండబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వేణు చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Women Asia Cup 2024: మహిళల ఆసియాకప్ లో భారత్ జోరు యూఏఈపై ఘనవిజయం